మంగినపూడి బీచ్‌లో అద్భుతంగా 63 అడుగుల సాగర తీర విజయగణపతి విగ్రహం!
రిపోర్టర్: రమేష్
స్థలం: కృష్ణా
కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్‌లో మట్టితో రూపొందించిన 63 అడుగుల సాగర తీర విజయగణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఈ ప్రాంతం పండగ శోభను సంతరించుకుంది. అటు సముద్రపు అలల హోరు, ఇటు భక్త జన సంద్రంతో మంగినపూడి తీరం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది.