ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో బీసీ రక్షణ చట్టం అమలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌లో బీసీల ఆత్మగౌరవ రక్షణే లక్ష్యంగా త్వరలో నూతన చట్టం తీసుకురానున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, బీసీలను దూషిస్తే కఠిన శిక్షలు ఉండేలా నిబంధనలు రూపొందించామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మళ్ళీ 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, సంప్రదాయ వృత్తులకు అండగా త్వరలో 'ఆదరణ 3.0' పథకం అమలు చేస్తామని ఆమె వెల్లడించారు.