స్థానిక ఎన్నికల షెడ్యూల్లో మార్పులు: నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీతో పోలింగ్ తేది మళ్లీ ఏకకాలంలో రావడం వల్ల, పరిషత్ ఎన్నికలను రెండు రోజులు వాయిదా వేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం నవంబర్ ఐదో తేదీన పోలింగ్ నిర్వహించి, ఏడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.