గూడూరులో తాగునీటి సమస్యలపై మున్సిపల్ అధికారులతో సునీల్ సమీక్ష
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో తాగునీటి సమస్యల పరిష్కారంపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులు మరియు వాటర్ వర్క్స్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. పట్టణ ప్రజలకు రోజుకు రెండు పూటల తాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం అవసరమైన ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, పైప్లైన్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.