అమరవీరుల స్మరణలో ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో రక్తదాతల భారీ స్పందన

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదానం చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. రక్తదానం ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఎంతో దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.