జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలపై మల్లారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష
రిపోర్టర్: శివ
స్థలం: మేడ్చల్ మల్కాజ్గిరి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు త్వరలోనే తాను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ విశ్వవిద్యాలయ సర్వేలో ఈ ప్రాంతం నాల్గవ స్థానంలో నిలవడం ప్రమాదకరమని, రోజూ ఇద్దరు మృత్యువాత పడుతున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు.