పాలక వర్గాల వైఫల్యాలపై నిప్పులు చెరిగిన (సీపీఐఎంఎల్) న్యూడెమోక్రసీ నేత
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ సభలో (సీపీఐఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజలు రేషన్ బియ్యంపై ఆధారపడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతున్న ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు కార్యకర్తలు హాజరై అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు.