రైతులకు యూరియా బస్తా ఇవ్వలేని దుర్మార్గ పాలన అంటూ బొత్స ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: విజయనగరం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలకు కనీసం ఒక యూరియా బస్తా కూడా అందించలేని దుర్మార్గపు పరిపాలన ఈ ప్రభుత్వానిది అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అన్నదాతలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న కూటమి నేతల వైఖరిపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.