అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాన బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కుసుమంచి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన కర్నె ఆదినారాయణ కుమారుడు వినయ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన అభిమాన నాయకుడు కేటీఆర్ ను కలవాలన్న బాలుడి కోరికను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చొరవతో నెరవేర్చారు. హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసిన వినయ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన వైద్య సహాయానికి అన్ని విధాలా సహకరిస్తానని భరోసా కల్పించారు.