ప్రధాని మోదీ నూరేళ్లు వర్ధిల్లాలని అమరావతిలో మంత్రి లోకేశ్ దీపోత్సవం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అమరావతిలోని తన ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. నమో76 ఆకారంలో దీపాలను అమర్చి వెలిగించి దేశ ప్రజల ఆశీస్సులతో మోదీ నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మోదీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, ఈ కార్యక్రమంలో భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పాల్గొన్నారని లోకేశ్ తెలిపారు.