విజయనగరం ఘోషా ఆసుపత్రిలో తప్పని స్కానింగ్ కష్టాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘోషా ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు నిలిచిపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా నెలకు పైగా రోజు విడిచి రోజు మాత్రమే స్కానింగ్‌ చేస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లలేక నిరుపేద మహిళలు రోజుల తరబడి ఆసుపత్రి వద్దే నిరీక్షిస్తున్నారు.