వాతావరణ హెచ్చరిక: తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
తెలంగాణలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రానున్న రెండు నెలల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, శీతాకాలంలోనూ ఎండల తీవ్రత తగ్గే అవకాశం లేదని వారు వెల్లడించారు. ఈ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.