భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి వేడుకలు
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: ఐనవిల్లి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గుత్తుల వారి పాలెంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మట్టపర్తి చైతన్య వెంకటేష్, మట్టపర్తి శ్రీను కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వద్ద ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 20వ తేదీన లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.