పీకల్లోతు నీటిలో మృతదేహాలతో గ్రామస్తుల కష్టాలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాదలో శ్మశానవాటికకు వెళ్లేందుకు వంతెన లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. బుధవారం మృతి చెందిన ఇద్దరి దహన సంస్కారాల కోసం గెడ్డ ఉద్ధృతిని లెక్కచేయకుండా పీకల్లోతు నీటిలో మృతదేహాలను మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామంలో నాలుగు వేల మంది జనాభా ఉన్నప్పటికీ, ఏడొంపుల గెడ్డపై వంతెన నిర్మించాలని ఏళ్లుగా కోరుతున్నా అధికారుల స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.