పులికాట్ సరస్సులో జీపీఎస్ ఆధారంగా చేపల వేటకు నిర్ణయం
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుపతి
పులికాట్ సరస్సులో జీపీఎస్ ద్వారా సరిహద్దులు నిర్ధారించి చేపల వేట కొనసాగించేందుకు ఏపీ, తమిళనాడు జాలర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కవిత అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే విజయకుమార్ పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య వివాదాలకు తెరదించేలా సరిహద్దుల గుర్తింపుపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.