వైద్య విద్యార్థిని అకీరాకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్
రిపోర్టర్: రమేష్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా వర్ధన్నపేటకు చెందిన ప్రతీభావంతురాలైన విద్యార్థిని కొండేటి అకీరా నీట్ పరీక్షలో 27,865 ర్యాంకు సాధించి పటాన్చెరులోని మహేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అకీరా పట్టుదలను గుర్తించిన ప్రముఖ నాయకులు కేటీఆర్ ఆమె చదువుకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయడంతో పాటు వైద్య విద్య పూర్తయ్యే వరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.