భూముల రీ సర్వే పనులపై అదనపు కలెక్టర్ రాములు హుకుం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన సర్వే పనులు మరియు రికార్డుల పరిశీలన ప్రక్రియలను వేగవంతం చేసి అన్ని దశలను ఎలాంటి జాప్యం లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.