రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: శివ
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపిందని, సినిమాల ప్రభావంపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని దర్శకుడు వేణు ఊడుగుల పేర్కొన్నారు. తరగతి గదిలోకి చొరబడి బాలికపై యువకుడు దాడి చేయడం అత్యంత అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేరానికి నేరస్థుడే పూర్తి బాధ్యత వహించాలని, అయితే తిరస్కరణను అంగీకరించని ధోరణిని సినిమాలు ప్రోత్సహించకూడదని వేణు ఊడుగుల స్పష్టం చేశారు.