నెల్లూరు జిల్లాలో పెరిగిన నిత్యావసరాలు మరియు హోటల్స్ ధరలు
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో సరైన వర్షాలు లేకపోవడం మరియు ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గి నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి ధర కిలో రూ.80కి చేరగా, సన్‌ఫ్లవర్ నూనె లీటరు రూ.180కి చేరుకుంది. ఈ ప్రభావంతో టీస్టాల్స్ నుంచి భోజన హోటళ్ల వరకు అన్నింటిలోనూ అల్పాహారాల ధరలు ప్లేటుపై రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగాయి.