భారతీయ పైలట్ల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా కీర్తి తెచ్చిపెట్టిందంటూ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ప్రశంస

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ సాహసం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని కింజరాపు రామ్మోహన్ నాయుడు - కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించి విమానంలోని అందరి ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణతో విశేష గౌరవం సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు.