ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

ఖానాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్కానింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.