మహిళల ఆసియా కప్: భారత్-పాక్ కెప్టెన్ల మధ్య మళ్ళీ షేక్‌హ్యాండ్ నిరాకరణ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

దుబాయ్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్లు హర్మన్‌ప్రీత్ కౌర్, ఫాతిమా సనా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. గత కొంతకాలంగా ఇరు జట్ల మధ్య ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, టీ20ల్లో 150వ మ్యాచ్‌కు సారథ్యం వహిస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన మైలురాయిని అందుకున్నారు.