రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో మెగా హార్టికల్చర్ హబ్
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేసి మంత్రి నారా లోకేష్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని లలిత కుమారి విజయనగరం వెల్లడించారు. జూన్ 7, 2023న ఇచ్చిన హామీని అమలు చేస్తూ మదనపల్లె కేంద్రంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకునే లక్ష్యంతో ఈ మెగా హబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ప్రాంతీయ అభివృద్ధితో పాటు అన్నదాతలకు పెద్దపీట వేస్తున్నారన్నారు.