యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ తగదు
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
రెండు వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే పీఎం టూ ఎం యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత సున్నా దశమకం నాల్గు శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ భారం కానుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ మార్జిన్ వ్యాపారాలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతాయని లేదా లావాదేవీలను విడగొడతారని తెలిపారు. వ్యాపారులపై ఛార్జీలు విధించకుండా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆయన కోరారు.