ఫెరారీ ఎఫ్‌40 కారును కొనుగోలు చేసిన లూయిస్ హామిల్టన్

రిపోర్టర్: నరేష్ స్థలం: World

ఫార్ములా వన్ స్టార్ లూయిస్ హామిల్టన్ సరికొత్త ఫెరారీ ఎఫ్‌40 కారును సొంతం చేసుకున్నారు. కేవలం 69 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఈ అరుదైన కారు ప్రయాణీకుల వైపు తలుపు ఇప్పటివరకు తెరవకపోవడం విశేషం. దీంతో ఈ కారులో తొలి ప్రయాణికురాలిగా కిమ్ కర్దాషియన్ కూర్చుంటారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.