కేరళ మల్టీప్లెక్స్‌లలో అధికారుల మెరుపు దాడులు, 25 ఉల్లంఘనలు గుర్తింపు!
రిపోర్టర్: సురేష్
స్థలం: Kerala
కేరళలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో విపరీతమైన ఆహార ధరలు, నాణ్యతా లోపాలపై లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్ మరియు ఫుడ్ సేఫ్టీ శాఖలు సంయుక్త తనిఖీలు చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ దాడులలో 25 ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు రూ.62,000 జరిమానా విధించారు. సరైన లైసెన్స్ లేని ఒక ఫుడ్ కౌంటర్‌ను మూసివేశారు. ఆహార పదార్థాల తూకంలో తేడాలు, ధరల ప్రదర్శనలో లోపాలు ఉన్నట్లు తేలింది.