రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతపై గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ను కలవడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. అధికార కూటమి పార్టీల నేతల దాడులు, అన్నమయ్య జిల్లా రాయచోటిలో పార్టీ కార్యాలయం దహనం, పులివెందుల కాల్పుల ఘటనలపై రాజ్భవన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసుల నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరనున్నట్లు సమాచారం.