ముంబైలో కత్తితో వీరంగం సృష్టించి బాలుడిని హతమార్చిన దుండగుడు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ముంబై
మహారాష్ట్రలోని ముంబై మల్వాణి ప్రాంతంలో శుక్రవారం ఉదయం రిజ్వాన్ ఖురేషి అనే ఇరవయ్యేళ్ల యువకుడు కత్తితో బీభత్సం సృష్టించాడు. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో బంటీ ఖాన్ అనే పద్నాలుగేళ్ల బాలుడి గొంతు కోసి హత్య చేయగా, చేతన్ పటేల్ అనే పాదచారి తీవ్రంగా గాయపడ్డాడు. మూడో వ్యక్తిపై దాడికి యత్నిస్తుండగా స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.