స్థానిక ఎన్నికల వేళ తిరుపతిలో పల్లె నిద్ర: పోలీసుల భద్రతా సమీక్ష
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భద్రతపై భరోసా కల్పించే లక్ష్యంతో పాటు ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా బి.ఎన్. కండ్రిగ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ అధికారులు కలిసి గజులపెల్లూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించామని తిరుపతి పోలీసులు వెల్లడించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించినట్లు వారు తెలిపారు.