అత్యవసర వేళల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112ను ఆశ్రయించండి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పల్నాడు

అత్యవసర పరిస్థితుల్లో లేదా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు పోలీసుల సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని పల్నాడు జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు మీ ఒక్క ఫోన్ కాల్ ఒక విలువైన ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రత్యేక అత్యవసర హెల్ప్లైన్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు పోలీసులు విజ్ఞప్తి చేశారు.