ముంబై ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్యతో తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: రాజేష్
స్థలం: Mumbai, Maharashtra
ముంబైలోని ఐఐటీ పవాయి క్యాంపస్లో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి మృతికి వ్యతిరేకంగా తోటి విద్యార్థులు పెద్దయెత్తున గుమిగూడి ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన డీసీపీ దత్తాత్రేయ నలావడే, విద్యార్థుల డిమాండ్లపై ఐఐటీ యంత్రాంగం చర్చలు జరుపుతోందని, సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. క్యాంపస్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు బలగాలను మోహరించారు.