అమరావతిలో ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయం ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమరావతి

అమరావతిలో ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు హైదరాబాద్లోని ఎఫ్ఆర్ఆర్ఓ పరిధిలో ఉండగా, తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ ఏపీని ప్రత్యేకంగా అమరావతి కార్యాలయం పరిధిలోకి తెచ్చారు. భారత్కు వచ్చే విదేశీయుల రిజిస్ట్రేషన్, ఇమిగ్రేషన్, వీసాల పొడిగింపు వంటి వ్యవహారాలను ఈ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా 12 ఎఫ్ఆర్ఆర్ఓలు ఉండగా, ఇప్పుడు అమరావతిలో 13వ కార్యాలయం ఏర్పాటవుతోంది.