కొండచరియలు విరిగిపడి విశాఖ వైపు పలు రైళ్లు రద్దు

రిపోర్టర్: అశోక్ స్థలం: రాయగడ

భారీ వర్షాల కారణంగా ఒడిశాలోని రాయగడ డివిజన్లో కొండచరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సౌత్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఎంవీజీ, సీటీఎస్ స్టేషన్ల మధ్య ట్రాక్పై కొండచరియలు పడటంతో కిరండూల్-విశాఖపట్నం మధ్య నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. భువనేశ్వర్-జగదల్పూర్ ఎక్స్ప్రెస్ను కోరాపుట్ వరకు మాత్రమే నడుపుతున్నామని, ప్రయాణికులు తమ ప్రణాళికలను మార్చుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.