మురిమడుగులో జలసిరి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామపంచాయతీలో జలసిరి పథకం కింద జరుగుతున్న ఫారం పాండ్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీల పనిదినాలు పెంచాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.