ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నిప్పులు: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ముసుగులో కుట్రపూరితంగా తొంభై లక్షల ఓట్లను తొలగించారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ ఆరు, ఏడు తేదీలలో గ్రామస్థాయిలో నిరసనలు నిర్వహిస్తామని, ఎనిమిదో తేదీన లోక్ భవన్ ముట్టడిస్తామని ఆయన పేర్కొన్నారు.