చేయూత పింఛన్లు.. కొత్త దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక మార్గదర్శకాలు
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 25లోపు వెరిఫికేషన్ పూర్తి చేసి, అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్లకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెరిఫికేషన్ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. అధికారులు మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాతే పెన్షన్ల మంజూరు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.