రష్యా ఎస్-35 యుద్ధ విమానాల కొనుగోలును ధ్రువీకరించిన ఇరాన్ దేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: ఇరాన్

రష్యా నుంచి అత్యాధునిక ఎస్-35 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పూర్తయినట్లు ఇరాన్ సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రామిన స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ కొనుగోలు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ యుద్ధ విమానాల డెలివరీ మాత్రం ప్రస్తుత యుద్ధాలు ముగిసిన తర్వాతే ఇరాన్ కు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో సరికొత్త వ్యూహాత్మక సమీకరణాలకు దారితీస్తోంది.