ఐనవిల్లి విఘ్నేశ్వరుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న నల్లా పవన్
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: ఐనవిల్లి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి ప్రసిద్ధ సిద్ధి వినాయక స్వామి వారిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గర్భాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అల్లవరపు సంతోషి రవిశర్మ తదితరులు పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు.