ఓటర్ల జాబితాలో భారీ లోపాలు: ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
ఓటర్ల జాబితాలో తప్పులు కొనసాగుతున్నాయని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వెలువడిన జాబితాలను పరిశీలిస్తే స్పష్టంగా కనపడుతోందని బాధితులు తెలిపారు. చెర్లోవంగల్లు గ్రామ జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం విచిత్రంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పలువురి ఫొటోలు అపసవ్యంగా ఉన్నాయని, గుర్తించేందుకు వీలు లేకుండా ఉన్నాయని వారు వాపోయారు. తక్షణమే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.