హుబ్లీలో జెజీఎంఎం మెడికల్ కళాశాలను సందర్శించిన అమిత్ షా
రిపోర్టర్: సునీల్
స్థలం: Hubballi
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. అక్కడ ఉన్న ప్రముఖ జెజీఎంఎం మెడికల్ కాలేజ్ అండ్ కేఎల్ఈ హాస్పిటల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ క్యాంపస్‌ను ఆయన సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా వైద్య సంస్థల నిర్వహణ, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, పరిశోధన కేంద్రాల తీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు ఆయనతో పాటు పాల్గొన్నారు.