జపాన్‌ను తాకనున్న తుఫాను ఎఫెక్ట్‌తో ఏషియన్ గేమ్స్ ఈక్వెస్ట్రియన్ పోటీ వాయిదా

రిపోర్టర్: హరి స్థలం: జపాన్

జపాన్ పసిఫిక్ తీరాన్ని తాకనున్న శక్తివంతమైన తుఫాన్ దుజువాన్ కారణంగా ఆసియన్ గేమ్స్ 2026 పోటీలపై తీవ్ర ప్రభావం పడింది. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం జరగాల్సిన ఈక్వెస్ట్రియన్ ఈవెంటింగ్ పోటీని మంగళవారానికి నిర్వాహకులు వాయిదా వేశారు. జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టోక్యోతో పాటు కంటో-కోషిన్, టోకై ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.