గరివిడి పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకుని యువకుడు హల్ చల్
రిపోర్టర్: రమేష్
స్థలం: గరివిడి
కుటుంబ కలహాల నేపథ్యంలో గరివిడి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎండీ గౌస్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. కాకినాడకు చెందిన గౌస్ తన భార్య రమ్యశ్రీతో విభేదాల కారణంగా శివరాంలో ఉంటున్నాడు. పాపను తనకు అప్పగించాలంటూ భార్యతో గొడవపడి, స్టేషన్ వద్దకు వచ్చి బెదిరింపులకు దిగాడు. అప్రమత్తమైన పోలీసులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అతడిని అడ్డుకుని పరిస్థితిని సద్దుమణిగిస్తూ అక్కడి నుంచి పంపించివేశారు.