సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ: అధికారులకు కీలక ఆదేశాలు జారీ
రిపోర్టర్: సతీష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
చందానగర్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీస్ వెల్లడించారు. ఈ సందర్భంగా పురుషుల బ్యారెక్, క్రైమ్ స్టేషన్, డీఐ రూమ్, సైబర్ క్రైమ్ వర్క్‌స్టేషన్, సీసీటీఎన్ఎస్ విభాగం, ఐవోల గదులతో పాటు రైటర్ల సెక్షన్‌ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు అధికారులు విధుల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ, బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఈ తనిఖీలో ఆయన స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.