మల్లం బ్రహ్మోత్సవాలలో వేడి సాంబార్ పడి పన్నెండు మంది భక్తులకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం బ్రహ్మోత్సవాలలో వేడి సాంబార్ ఉన్న పాత్రలో ప్రమాదవశాత్తు పడటంతో పన్నెండు మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని చెన్నైకి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉత్సవాల సమయంలో ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.