చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి: సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ బుధవారం జరగనున్న అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సర్పంచ్ల హక్కుల సాధన కోసం, పెండింగ్ బిల్లుల విడుదల కోసమే ఈ నిరసన అని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేసి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని సర్పంచ్లు పెద్దఎత్తున తరలివచ్చి ఈ ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.