ఈ ఆదివారం కూడా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు పని చేస్తాయి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సెప్టెంబర్ 27 ఆదివారం రోజున కూడా అన్ని ప్రభుత్వ రంగ మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి అధికారికంగా ఆమోదం తెలిపింది.