బిచ్చగాడి వేషంలో కనిపించిన కోట్ల ఆస్తులున్న బీజేపీ ఎమ్మెల్యే

రిపోర్టర్: మహేష్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా గురువు ఆదేశాల మేరకు బిచ్చగాడి వేషంలో రోడ్డెక్కారు. కోట్ల ఆస్తులున్న ఆయన ఒక రోజు భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌పై గడిపారు. ఈ అనుభవం తనకు అహంకారాన్ని వీడి మానవత్వాన్ని చాటుకునే గొప్ప పాఠం నేర్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ వినూత్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.