ఫామ్ హౌస్ పై దమ్మున్న సవాల్ విసిరిన కేటీఆర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్ పేరుతో విష ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. జన్వాడలో ఉన్నది తన ఇల్లు కాదని, తన మిత్రుడికి చెందిన ఫామ్ హౌస్‌ను మాత్రమే తాను లీజుకు తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఆ ఫామ్ హౌస్ తనదని నిరూపిస్తే ఎవరికైనా రాసిస్తానని కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ దమ్మున్న సవాల్ విసిరారు.