మూడేళ్ల బాలుడిని సంరక్షకులకే అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: సురేష్
స్థలం: వెస్ట్ బెంగాల్
పుట్టినప్పటి నుంచి సంరక్షిస్తున్న మూడేళ్ల బాలుడిని ఆ దంపతులకు తిరిగి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆదేశించింది. బాలుడి కస్టడీ తీసుకోవడానికి కమిటీకి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని జస్టిస్ కృష్ణారావు స్పష్టం చేశారు. అయితే దంపతులు చట్టపరంగా దత్తత తల్లిదండ్రులుగా గుర్తింపు పొందడానికి తగిన కోర్టును ఆశ్రయించాలని కోర్టు సూచించింది.