స్నేహధర్మాన్ని చాటుకున్న పదో తరగతి మిత్రులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో కడవెరుగు భిక్షపతి మృతి చెందడంతో ఆయన కుమారుడు శ్రీనివాస్‌కు 2004-05 పదో తరగతి మిత్రులు రూ.10,800 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని భరోసానిచ్చి మానసిక స్థైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు చెట్కూరి కుమార్, చోల్లేటి స్వామి, గ్యార నాగరాజు తదితరులు పాల్గొన్నారు.